ఎక్కడ డబ్బు దొరికినా కాంగ్రెస్‌దే అంటున్నారు .. నా సవాల్‌ను కేసీఆర్ పట్టించుకోలేదు : రేవంత్ రెడ్డి

By Siva Kodati  |  First Published Oct 17, 2023, 2:34 PM IST

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మందు, మద్యం పంచలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . వచ్చే ఎన్నికల్లో మద్యం, నగదు పంచకుండా ప్రజలను ఓట్లు అడుగుదామని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. 


మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మందు, మద్యం పంచలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఆర్ధిక స్తోమత లేదు, ఆ తరహాలో ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచన లేదని రేవంత్ స్పష్టం చేశారు. అక్కడ పోటీ చేసింది, పోరులో నిలిచింది బీజేపీ, బీఆర్ఎస్‌లేనని ఆయన అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ, మునుగోడులో బీఆర్ఎస్ గెలిచిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ అని, ఆ తర్వాత మునుగోడు దానిని కూడా దాటేసిందని ఆయన తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల నుంచి కాంగ్రెస్‌కు కోట్లకొద్దీ కరెన్సీ కట్టలు వస్తున్నాయని తమపై ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, నగదు పంచకుండా ప్రజలను ఓట్లు అడుగుదామని ఆయన సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

Latest Videos

Also Read: కేసీఆర్ కు సవాల్ : రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత...

కాంగ్రెస్ పార్టీ చుక్క మందు పోయకుండా, పైసా డబ్బులు పంచకుండా.. మా ఆరు గ్యారెంటీలతోనే ప్రజల్లోకి వెళ్తామని రేవంత్ అన్నారు. మద్యం, డబ్బు పంచడమే కేసీఆర్ విధానమని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ చెప్పిన నిధులు రాలేదు, నియామకాలు నీ ఇంట్లోకే వెళ్లాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ డబ్బులు దొరికినా కాంగ్రెస్‌వే అని ప్రచారం చేస్తున్నారని, తమ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 

click me!