బీజేపీలోకి ఈటల.. ఇప్పుడు ఆ నివేదికలు, విచారణ ఏమయ్యాయి: కేసీఆర్‌పై రేవంత్ ఆరోపణలు

By Siva KodatiFirst Published Jun 27, 2021, 5:10 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు పెంచారు రేవంత్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని వేర్వేరుగా చూడొద్దని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తప్పులు దొరికే సమయంలో పర్యటనలు, సమీక్షలు అంటూ హాడావుడి చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు పెంచారు రేవంత్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని వేర్వేరుగా చూడొద్దని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తప్పులు దొరికే సమయంలో పర్యటనలు, సమీక్షలు అంటూ హాడావుడి చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈటల ఆరోపణలపై ఇప్పుడు నివేదికలు ఎక్కడపోయాయని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై విచారణ ఏమైందని రేవంత్ నిలదీశారు. ఈటల రాజేందర్‌ను కేసీఆర్ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. అధికారం కాపాడుకోవడానికి కేసీఆర్ వింతపోకడలకు పోతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తానని రేవంత్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. 

Also Read:ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్‌ని వీడి... దానిని బీజేపీకి తాకట్టుపెట్టారు: ఈటలపై హరీశ్ వ్యాఖ్యలు

టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. రేవంత్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత కిచ్చన్నరెడ్డి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒక పక్కన రేవంత్ వర్గం సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు అసంతృప్త నేతలు రాజీనామా బాట పడుతూ వున్నారు.  

click me!