నాలుగో తరగతిలో స్నేహితులతో దిగిన ఫోటో: ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్

Published : Jun 27, 2021, 04:21 PM IST
నాలుగో తరగతిలో స్నేహితులతో దిగిన ఫోటో: ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్

సారాంశం

 తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లోత తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకొన్నాడు. ట్విట్టర్ లో మంత్రి చాలా యాక్టివ్ గా ఉంటారు. 

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లోత తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసుకొన్నాడు. ట్విట్టర్ లో మంత్రి చాలా యాక్టివ్ గా ఉంటారు. 1984లో నాలుగో తరగతి చదువుకొనే సమయంలో స్కూల్ లో దిగిన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. తన మిత్రుడు తనకు ఈ ఫోటోను పంపాడని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

భరత్ అనే తన క్లాస్ మేట్ ఈ ఫోటోను తనకు నిన్న పంపాడన్నారు. కరీంనగర్ లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ లో నాలుగో తరగతి చదివే సమయంలో సహచర విద్యార్థులు, టీచర్లతో దిగిన ఫోటోగా  కేటీఆర్ చెప్పారు. ఫోటోలోని తన క్లాస్ మెట్స్ ను ఆయన గుర్తుకు చేసుకొన్నారు.ట్విట్టర్ వేదికగా ఎవరైనా తమకు సహాయం చేయాలని కోరితే మంత్రి వెంటనే తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కేటీఆర్  మాట్లాడుతుంటారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతుంటారు. 


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే