హుజురాబాద్‌ మీదున్న శ్రద్ధ.. సైదాబాద్ చిన్నారి మీద లేదు, ఒక్క రివ్యూ చేశారా: కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 17, 2021, 09:46 PM ISTUpdated : Sep 17, 2021, 09:53 PM IST
హుజురాబాద్‌ మీదున్న శ్రద్ధ.. సైదాబాద్ చిన్నారి మీద లేదు, ఒక్క రివ్యూ చేశారా: కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం

సారాంశం

సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిపాపపై అత్యాచారం జరిగితే ఏడు రోజులైన సీఎం అధికారులను పిలిచి వివరాలు కనుక్కోలేదని మండిపడ్డారు. కానీ హుజురాబాద్‌లో ఎన్నికలు ఎలా జరగాలని సమీక్షలు చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు

సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల పసిపాపను గణేశ్ మండపం వద్ద ఆడుకోవడానికి పోతే గంజాయి మత్తులో ఒక యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశాడని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను కాళ్లు, చేతులు విరిచేసి మూట కట్టాడని.. అది చూడలేక ఏడుపు ఆపుకున్నానని ఆయన తెలిపారు. ఇంత అన్యాయం జరిగితే ఏడు గంటల వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని.. పక్క గుడిసెలో అనుమానంగా వుందని చెబితే కేసు నమోదు కాలేదని దాదాపు ఐదు గంటల పాటు తలుపులు బద్ధలు కొట్టలేదని రేవంత్ ఆరోపించారు.

చివరికి స్థానికులు తలుపులు బద్ధలు కొట్టి శవాన్ని బయటకు తీసుకొస్తే వెయ్యి మంది పోలీసులు గిరిజనులపై లాఠీఛార్జీ చేసి తల్లిదండ్రుల్ని చితకబాది శవాన్ని తీసుకెళ్లారు తప్పించి నేరస్తుల్ని అరెస్ట్ చేయలేదని రేవంత్ ఆరోపించారు. అరెస్ట్ చేయకముందే.. చేశారని అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించిన కేటీఆర్‌ను పట్టుకుని నిలదీస్తే తప్పు సరిదిద్దుకున్నానని ట్విట్టర్‌లో పెట్టాడు తప్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోలేదన్నారు. చివరికి వారం తర్వాత ఏడు లక్షల కెమెరాలు పెట్టామని... చీమ చిటుక్కుమన్నా పట్టుకుంటామని డీజీపీ , హైదరాబాద్ సీపీ చెప్పారంటూ ఎద్దేవా చేశారు.

Also Read:మీ ఇంట్లో నాలుగు పదవులా.. మేనల్లుడినో, కొడుకునో తొలగించాలి: కేసీఆర్‌కు రేవంత్ డిమాండ్

ఇంత జరుగుతున్నా ఏడు రోజుల పాటు నిందితుడిని అరెస్ట్ చేయలేదని... ఆ నేరగాడు తన నేరం బాధలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. ముక్కుపచ్చలారని పసిపాపపై అత్యాచారం జరిగితే ఏడు రోజులైన సీఎం అధికారులను పిలిచి వివరాలు కనుక్కోలేదని మండిపడ్డారు. కానీ హుజురాబాద్‌లో ఎన్నికలు ఎలా జరగాలని సమీక్షలు చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా  చేశారు.

వనపర్తిలో ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదని లావణ్య అనే దళిత విద్యార్ధిని చనిపోతే కనీసం పలకరించలేదని ఆయన దుయ్యబట్టారు. 19  నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. పంజాగుట్ట చౌరస్తాలో 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ యువత కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ధర్మయుద్ధానికి రేవంత్ పిలుపునిచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం