ధరణితో 70 లక్షల భూముల వివరాలు ప్రైవేట్ చేతుల్లోకి: రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 14, 2023, 4:47 PM IST

ధరణి పోర్టల్ కారణంగా  ప్రజలకు నష్టమే ఎక్కువగా  ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెప్పారు.  ప్రజల భూముల  వివరాలన్నీ  ప్రైవేట్  చేతుల్లోకి  వెళ్లాయని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.
 


హైదరాబాద్: తెలంగాణకు  చెందిన  70 లక్షల  భూ యజమానుల వివరాలు  ధరణి పోర్టల్ కారణంగా  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.టీపీసీసీచీఫ్  రేవంత్ రెడ్డి  బుధవారంనాడు   మీడియాతో మాట్లాడారు.ధరణి  పోర్టల్ ను  ప్రైవేట్ సంస్థకు అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ధరణి  నిర్వహణను  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  లీజింగ్ ఫైనాన్స్  సంస్థకు అప్పగించారని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  ప్రజల భూముల వివరాలను ప్రైవేట్ సంస్థ  చేతిలో పెట్టారని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.   ధరణి  పోర్టల్  మొత్తం ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ  చూస్తుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ   వివిధ  బ్యాంకులకు రూ. 90 వేల  కోట్లను ముంచిందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. 

రూ.90 వేల కోట్లకు  దివాళా తీసిన ఐఎల్ఎప్ఎస్  సంస్థతో  ప్రభుత్వం  ఒప్పందం  చేసుకుందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఐఎల్ఎఫ్ఎస్  సంస్థలో  పిలిఫ్పిన్స్ కు  చెందిన కంపెనీ  పెట్టుబడులు పెట్టిందని  రేవంత్ రెడ్డి వివరించారు.ప్రజల భూముల వివరాలన్నీ  ప్రైవేట్  వ్యక్తుల  చేతుల్లో  పెడుతున్నారని  తాను మొదటి నుండి చెబుతున్నానని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Latest Videos

undefined

ధరణి  పోర్టల్ నిర్వహిస్తున్న  ఐఎల్ఎఫ్ఎస్  సంస్థలో  ఆ సంస్థకు  ఒక్క శాతం నిధులే ఉన్నాయన్నారు మిగిలిన 99 శాతం  నిధులు  పిలిఫ్పిన్స్ కంపెనీకే ఉన్నాయని రేవంత్ రెడ్డి  వివరించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ ను  ఆయన మీడియా సమావేశంలో  చూపారు.   శ్రీధర్ రాజు అనే వ్యక్తి చేతిలోకి ధరణి పోర్టల్ వెళ్లిపోయిందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  రాష్ట్రంలోని  70 లక్షల భూ యజమానుల  వివరాలను ఐఎల్ఎఫ్ఎస్  సంస్థకు విక్రయించారన్నారు.ధరణి నిర్వహణపై  రూ,. 150 కోట్లతో ఒప్పందం  చేసుకున్న విషయాన్ని  రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ  ఒడిశాలో ీ ఈ ధరణి  పోర్టల్ నిర్వహించిన  విషయాన్ని రేవంత్ రెడ్డి  ప్రస్తావించారు.  ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ  పనితీరు దారుణంగా  ఉందని  కాగ్  రిపోర్టు  ఇచ్చిందని  రేవంత్ రెడ్డి  తెలిపారు. 

ధరణి  పోర్టల్ తో  కేసీఆర్ దోచుకుంటున్నారని  ఆయన ఆరోపించారు.  ధరణి వెనుక దొరలు, రాజులున్నారన్నారు..  ధరణి  దోపీడీని  ప్రజలకు వివరిస్తామన్నారు.రైతులు  కేసీఆర్  ను  క్షమించరన్నారు.  భరించలేని  స్థాయిలో  కేసీఆర్  దుర్మార్గాలున్నాయని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ..

click me!