డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఆ సెలబ్రెటీల చిట్టా సేకరిస్తామన్న పోలీసులు

Siva Kodati |  
Published : Jun 14, 2023, 04:39 PM IST
డ్రగ్స్ కేసు.. కేపీ చౌదరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఆ సెలబ్రెటీల చిట్టా సేకరిస్తామన్న పోలీసులు

సారాంశం

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కేపీ చౌదరికి కోర్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అతని వద్ద డ్రగ్స్‌ను కొనుగోలు చేసే వారి చిట్టా సేకరిస్తామని డీసీపీ వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఈ కేసుకు సంబంధించి కేపీ చౌదరికి కోర్ట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే కేపీ చౌదరికి చాలా మంది సెలబ్రెటీలతో సంబంధాలు వున్నాయని తెలిపారు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయనను మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు.

అతను డ్రగ్స్‌ను కొనుగోలు చేసి సెలబ్రెటీలకు అమ్ముతూ వుంటాడని డీసీసీ తెలిపారు. ఈ క్రమంలోనే 90 గ్రాముల కొకైన్‌ను సెలబ్రెటీలకు అమ్మేందుకు కేపీ చౌదరి తెచ్చాడని..అతని వద్ద డ్రగ్స్‌ను కొనుగోలు చేసే వారి చిట్టా సేకరిస్తామని డీసీపీ వెల్లడించారు. అలాగే కేపీ చౌదరి గతంలో డ్రగ్స్‌ను ఎవరెవరికి విక్రయించాడనే వివరాలను కూడా సేకరిస్తామని ఆయన చెప్పారు. 

ALso Read: డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులో కబాలి సినీ నిర్మాత కె.పి.చౌదరి...

కాగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నట్లు సమాచారం.  ఆయన వద్ద ఉన్న కొకైన్ ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  
 
 
 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?