దేవుడి మాన్యం పంపకాల్లో గొడవే.. కేసీఆర్- ఈటల విడిపోవడానికి కారణం: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 7:50 PM IST
Highlights

దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉపఎన్నికకు దారితీసిందని వివరించారు

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) విమర్శల దాడి పెంచారు. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి (venkat balmoor) తరఫున ప్రచారం చేస్తూ ఇల్లంతకుంటలో రేవంత్ ప్రసంగించారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల వల్లే కేసీఆర్, ఈటల విడిపోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన గొడవే ఈటల రాజీనామాకు, తద్వారా హుజూరాబాద్ ఉపఎన్నికకు దారితీసిందని వివరించారు. దొంగ సొమ్ములో వాటాలు కుదరక జుట్లు పట్టుకుని కొట్టుకుని నేడు ఉపఎన్నిక తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.  వేషం మార్చి బీజేపీ తరఫున పోటీచేస్తున్నంత మాత్రాన ఈటల ఉత్తముడు కాదని అన్నారు.

వీళ్లిద్దరూ దేనికి కొట్లాడారు? పేదల పెన్షన్ కోసం కొట్లాడారా? రైతులకు గిట్టుబాటు ధర కోసం కొట్లాడారా? చదువుకున్న యువతకు ఉద్యోగాల కోసం కొట్లాడారా? రైతు రుణ మాఫీ కోసం కొట్లాడారా? డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కొట్లాడారా?" అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ తాను ప్రతి మహిళకు పెద్ద కొడుకునని చెప్పుకుంటున్నాడని, కేసీఆర్ పెద్దకొడుకు కాదని దొంగ కొడుకు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన కన్న కొడుకులకు నౌకరీ ఇస్తే ఇవాళ ఇలా అడుక్కుతినే పరిస్థితి వచ్చేదా? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హుజూరాబాద్  ప్రసంగించారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.

ALso Read:డీజీపీ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్: రేవంత్ రెడ్డి సంచలనం

అంతకుముందు ఉదయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ డీజీపీ  Mahender Reddy  ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ రెండు చీలిపోయిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్,  మాజీ మంత్రి ఈటల రాజేందర్  మధ్య ఆదిపత్య పోరు వల్లే Huzurabad bypoll  వచ్చిందన్నారు. Trs, Bjpలు కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నాయని ఆయన విమర్శించారు. మా అభ్యర్ధి బల్మూరి వెంకట్ అనామకుడైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు  కూడా అనామకులేనని ఆయన చెప్పారు. ఎన్నికల పిరాయింపులతోనే తెలంగాణ రాజకీయం నడుస్తుందని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ ,సుగంధాలపై కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తుంటే ప్లీనరీ పేరుతో కేటీఆర్ వంటకాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

click me!