నమ్మక ద్రోహి .. ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .  ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. 

tpcc chief revanth reddy sensational comments on minister errabelli dayakar rao ksp

బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గురువారం పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఎర్రబెల్లి శత్రువులతో చేతులు కలిపి తనకు ద్రోహం చేయడం వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. 40 ఏళ్ల క్రితం డీలర్‌గా వున్న దయాకర్ రావు.. ఇప్పుడు డాలర్ దయాకర్ రావుగా ఎలా మారారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఎర్రబెల్లి నమ్మక ద్రోహి.. మిత్ర ద్రోహి అని టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తిలో గత 40 ఏళ్లుగా ఎర్రబెల్లి ఏకచత్రాధిపత్యం వహించారని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన హయాంలో వందలాది మంది సర్పంచ్‌లు ఆందోళనలు, ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తండాలు, ఆదివాసీ గూడెలలో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ సర్పంచ్‌లకు బిల్లులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఈ ప్రాంతంలో రూ.360 కోట్లతో ప్రారంభించిన రిజర్వాయర్ ఖర్చును రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్లను ఎర్రబెల్లి దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

Latest Videos

ఎర్రబెల్లి దయాకర్ రావు దోచుకుంటుంటే.. రాజేందర్ రెడ్డి కుటుంబం దానధర్మాలు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించలేదని రేవంత్ విమర్శించారు. రేషన్ డీలర్‌గా జీవితం ప్రారంభించిన ఎర్రబెల్లికి వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. నమ్మించి మోసం చేయడంలో ఆయనను మించిన వారు లేరని రేవంత్ ఆరోపించారు. 

vuukle one pixel image
click me!