లెక్కలు అడిగినందుకే శశిథర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు.. ఆ నలుగురికే నేను నచ్చను : రేవంత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 27, 2022, 2:55 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్‌లోని ఓ నలుగురికే నేను నచ్చనని, మిగిలిన వారంతా తన వెంటేనని ఆయన తెలిపారు. తాను పీసీసీ అయ్యాక 30 మంది కాంగ్రెస్‌లో చేరితే.. ముగ్గురు మాత్రమే పార్టీని వీడి వదిలిపెట్టారని రేవంత్ చెప్పారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి కొందరు సీనియర్లు అసంతృప్తితో వున్న సంగతి తెలిసిందే. ఆయనపై అక్కసును బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం టీ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. దశాబ్ధాలుగా మర్రి కుటుంబం కాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని పెనవేసుకుపోయింది. అలాంటిది మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అందరిలాగే వెళ్తూ వెళ్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నలుగురు వ్యక్తులు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని... వాళ్లు తప్పించి మిగిలిన వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని రేవంత్ వున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడిని తప్పుబట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ట్రస్ట్‌కు సంబంధించి కోట్లాది రూపాయాలను శశిథర్ రెడ్డి స్వాహా చేశారని.. వాటి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరరాని రేవంత్ ఆరోపించారు. 

ALso Read:కాంగ్రెస్‌కి గుడ్‌బై: బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

డిసెంబర్ తొలి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ చెప్పారు. అధికారంలో వున్నప్పుడు పదవులు అనుభవించి.. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఏ రోజైన రోడ్డెక్కారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా తన తండ్రి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆదిత్య రెడ్డి 2018లో కోదండరాం పార్టీలో చేరిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు దాసోజు శ్రావణ్ ఆ పార్టీని వీడి వెళ్లారని తెలిపారు. పరిస్ధితిని బట్టి ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని చెప్పినా ఏఐసీసీ చెప్పినా ఆయన వినలేదన్నారు. తాను పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 30 మంది కాంగ్రెస్‌లో చేరారని, కానీ పార్టీని వీడి వెళ్లింది మాత్రం ముగ్గురేనని రేవంత్ పేర్కొన్నారు. 


 

click me!