తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్.. డిసెంబర్ 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు.. పూర్తి వివరాలు ఇవే.

By Sumanth KanukulaFirst Published Nov 27, 2022, 11:49 AM IST
Highlights

పోలీసు ఉద్యోగా భర్తీకి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 8 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

పోలీసు ఉద్యోగా భర్తీకి సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 8 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షల నిర్వహించనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు ఆదివారం పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. 11 కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌‌లలోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన కొత్త ప్రదేశంలో కూడా ఈసారి ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్‌ల నిర్వహణ ఉంటుందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్టు తెలిపింది.

డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ఈ పక్రియ పూర్తి కావడానికి 23 నుంచి 25 పనిదినాల పడుతుందని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్టు పేర్కొంది. జనవరి మొదటి వారానికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. అర్హత సాధించి, పార్ట్ 2 దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులందరూ దేహదారుఢ్య పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను నవంబర్ 29 నుండి డిసెంబర్ 3 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన సూచనలతో కూడిన వివరాలను https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  

అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు.. support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది. ఇక, ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని పేర్కొంది.

దేహదారుఢ్య పరీక్ష ప్రక్రియలో భాగంగా తొలుత పురుష అభ్యర్థులకు 1600 మీటర్ల రన్నింగ్​, మహిళా అభ్యర్థులకు రన్నింగ్ నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఎత్తును కొలుస్తారు. ఎత్తు కొలతలో అర్హత సాధించిన అభ్యర్థులకు లాంగ్ జంప్, షాట్‌పుట్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పలు సూచనలను కూడా పోలీసు రిక్రూట్‌మెంట్ చేసింది. ఇక, 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్స్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

click me!