
పోలవరంతోనే (polavaram ) భద్రాచలం (bhadrachalam) మునిగితే కేసీఆర్ (kcr) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . పోలవరం ఎత్తు పెంచుతూ వుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. భద్రాచలం ముంపునకు క్లౌడ్ బరెస్ట్ (cloud burst) అని కేసీఆర్... పోలవరం అని వాళ్ల మంత్రి చెబుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇద్దరిలో ఎవరి మాటను నమ్మాలని రేవంత్ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) మాట్లాడుతూ.. పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు వుంటుందన్నది పాత విషయమేనని అన్నారు. అంతా విభజన చట్టం ప్రకారమే జరుగుతుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని... హైదరాబాద్‌ను ఏపీలో కలిపేయమని అడగగలమా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలిపిస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారమే ఇప్పుడు ముఖ్యమని... సీఎం అయినా, మంత్రులైనా బాధ్యతగా మాట్లాడాలని సత్యనారాయణ పేర్కొన్నారు. పోలవరంపై ఏదైనా ఉంటే చర్చించుకోవాలని.. రెచ్చగొట్టొద్దని బొత్స సూచించారు. వందేళ్ల తర్వాత ఇంతటి వరద వచ్చిందని... ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Also REad:క్లౌడ్ బరస్ట్ కామెంట్స్: కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్..!
తాజాగా క్లౌడ్ బరస్ట్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని అన్నారు. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని చెప్పారు. కాకపోతే కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు. అయితే గవర్నర్ తమిళిసై చేసిన ఈ కామెంట్స్.. కేసీఆర్‌కు కౌంటర్‌గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక, గత కొంతకాలంగా తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం.. కేసీఆర్ దాదాపు 8 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే దీంతో పరిస్థితులు కాస్తా చక్కబడినట్టుగా అంతా భావించారు. అయితే ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకే రోజు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పర్యటనలు సాగించడం.. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య విభేదాలు తొలగిపోలేదనే చర్చను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా క్లౌడ్ బరస్ట్‌పై తమిళిసై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.