క్లౌడ్ బరస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.ఈ విషయమై కేంద్రం విచారణ చేయిస్తుందన్నారు.
హైదరాబాద్: Cloud Burst పై తెలంగాణ సీఎం KCR వద్ద సమాచారం ఉంటే ఇవ్వాలని కేంద్ర మంత్రి Kishan Reddy కోరారు. దేశంలో క్లౌడ్ బరస్ట్ కు సంబంధించి విదేశాలు కుట్రలు చేసిన విషయమై తన వద్ద ఉన్నసమాచారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ చేయిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
మంగళవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం Bhadrachalam లో దేశంలో క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుమానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు. గతంలో కూడా జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరస్ట్ జరిగిందన్నారు. తాజాగా గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా క్లోడ్ బరస్ట్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీని వెనుక వీదేశీ శక్తుల హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాలు నిర్ధారణ కావాల్సి ఉందన్నారు.
undefined
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. క్లౌడ్ బరస్ట్ విషయమై కేసీఆర్ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వాలన్నారు. ఈ వివరాల ఆధారంగా కేంద్రం విచారణ చేయించనుందన్నారు. ఇప్పటివరకు ఒక దేశంలో మరో దేశం క్లౌడ్ బరస్ట్ చేసిన సందర్భాలు లేవన్నారు. జమ్మూ కాశ్మీర్ లోని లడ్ఢాఖ్, ఉత్తరాఖండ్ లలో క్లౌడ్ బరస్ట్ చేసినట్టుగా ఆధారాలుంటే కేంద్రానికి వెంటనే ఇవ్వాలని మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ను కోరారు. ఇండియాలో క్లౌడ్ బరస్ట్ కు ఏ దేశాలు కుట్రలు చేశాయో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
భద్రాచలంలో వరద ముంపును పరిశీలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి భద్రాచలానికి వచ్చిన కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు చేశారు భద్రాచలంలో పునరావాస కేంద్రంలో ముంపు బాధిత ప్రజలతో మాట్లాడారు. ఆ తర్వాత ఐడీడీఏ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.Godavariకి అసాధారణ వరదలు రావడం వెనుక క్లౌడ్ బరస్ట్ జరిగిందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
also read: క్లౌడ్ బరస్ట్ కామెంట్స్: కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్..!
కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. సమస్యలను పక్కదారి పట్టించేందుకు గాను కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు అభిప్రాయపడ్గాయి. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే కోరారు మరో వైపు ఈ వ్యాఖ్యలను జోక్ గా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అభివర్ణించారు. గోదావరి వరదల విషయంలో తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఇవాళ స్పందించారు.క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. గోదావరికి భారీగా వరదలు రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముంపు గ్రామాల్లో తమిళిసై పర్యటించిన విషయం తెలిసిందే.