
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పదికొండేళ్ల బాలిక మీద auto driver వెంకటయ్య molestationకి పాల్పడ్డాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలిక మీద ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. మార్చి 31న బాధిత బాలిక తన స్నేహితురాలితో కలిసి school నుంచి ఇంటికి వెడుతోంది. ఈ క్రమంలో బాలికకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ ఆమెను మాత్రమే తన ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు.
ఏప్రిల్ 1న ఈ విషయాన్ని బాలిక స్నేహితురాలు స్కూల్ టీచర్ కు చెప్పడంతో ఆమె బాలికను పిలిపించి విషయం తెలుసుకుంది. ఆటో డ్రైవర్ వెంకటయ్య తన మీద అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు స్కూల్ టీచర్ ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. అయితే పరువు పోతుందని.. ఇతర కారణాలతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో స్కూలు టీచర్ బాలిక తల్లిదండ్రులతో మళ్లీ మాట్లాడారు ఆ తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, madhya pradesh రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ పండ్ల వ్యాపారి ఇంటి నుంచి evil spiritsను తరిమికొడతాను అని చెప్పి ఓ మైనర్ బాలికపై ఆరు నెలల పాటు molestation చేశాడు. భోపాల్ లోని Habib ganjకు చెందిన 30 ఏళ్ల పండ్ల విక్రయదారుడు నిహాల్ బేగ్ ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు బాలిక ఇంటికి వచ్చినప్పుడు ఆమె కుటుంబ సభ్యులను నమ్మించి అదృష్టాన్ని తెస్తానని చెప్పి బాలికపై మొదట అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల వ్యాపారవేత్త. ఆమె తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.
కరోనా లాక్ డౌన్ సమయంలో బాలిక తండ్రికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ‘వారి దురదృష్టం వెనక ఒక దుష్టాత్మ ఉంది. దానిని పారదోల వలసిన అవసరం ఉంది.. దీని కోసం ప్రత్యేక ప్రార్థనలు అవసరం’ అని నిహాల్ బేగ్ బాలిక తల్లిదండ్రులను ఒప్పించాడు. నిందితుడు వారానికి రెండుసార్లు బాధితురాలి ఇంటికి వచ్చేవాడు. చారాల సమయంలో ప్రత్యేక గదుల్లో ఉండాలని కుటుంబ సభ్యులందరినీ నమ్మించాడు. మొదటిసారి నిందితుడు బాలికను భయపెట్టాడు. బాలిక తనతో శారీరకంగా కలవడానికి అనుమతించకపోతే ఆత్మ ఆమె తల్లిదండ్రులను చంపేస్తుంది అని చెప్పాడు.
ఆ తరువాత రెగ్యులర్ గా ప్రతీవారం రెండుసార్లు బాలిక మీద అత్యాచారంం చేస్తూ వస్తున్నాడు. దీంతో బాగా కుంగిపోయిన బాలిక.. చివరికి ధైర్యం చేసి తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడు అరెస్ట్ చేసి అతడిపై ఫోక్సో చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.