కాళేశ్వరంపై కాగ్ నివేదికపై చర్చకు రావాలి: కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ రెడ్డి సవాల్

By narsimha lode  |  First Published Jul 3, 2023, 5:40 PM IST

రాహుల్ గాంధీ చేసిన    విమర్శలపై   బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్దంగా ఉన్నారా అని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  కాళేశ్వరంపై  కాగ్ ఆక్షింతలు  వేసిందని  రేవంత్ రెడ్డి చెప్పారు.


హైదరాబాద్:కాళేశ్వరంపై  కాగ్ ఇచ్చిన నివేదికపై  చర్చకు  తాము సిద్దంగా ఉన్నామని టీపీసీసీ  చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులు హాజరౌతామన్నారు.  కేటీఆర్, హరీష్ రావులు చర్చకు సిద్దమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

సోమవారంనాడు  హైద్రాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2001లో  టీఆర్ఎస్ ఏర్పాటు  చేసిన నాటి నుండి  నిన్నటితో  ఆ పార్టీ ఆస్తులు  ఎంతకు  పెరిగాయని  చర్చించుకుందామా అని  రేవంత్ రెడ్డి  చెప్పారు. 

Latest Videos

undefined

కాగ్ ఇచ్చిన నివేదికపై  చర్చించేందుకు  తాము సిద్దమన్నారు. రాహుల్ గాంధీ  ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉందని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో మీరు తప్పును  చూపితే  దానికి మీరు విధించే శిక్షకు తాము సిద్దమని  రేవంత్ రెడ్డి  చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తమ అవినీతి  బయట పడిందని  కేటీఆర్, హరీష్ రావులు పెడ బొబ్బలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి  హరీష్ రావు  విమర్శించారు. 

నిన్న ఖమ్మంలో రాహుల్ గాంధీ  సభను  అడ్డుకొనేందుకు  ఓ సైకో మంత్రి  ప్రయత్నించారని  పువ్వాడ అజయ్ కుమార్ పై  రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 
దేశం  కోసం  ప్రాణాలర్పించింది రాహుల్ గాంధీ కుటుంబమని  రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.  అలాంటి  రాహుల్ గాంధీకి  తెలంగాణలో  పర్యటించే  అర్హత  రాహుల్ గాంధీకి లేదని  బీఆర్ఎస్ నేతలు  వ్యాఖ్యానించడాన్ని  ఆయన తప్పుబట్టారు.  త్యాగాలకు  గాంధీ కుటుంబం  పేరు పొందితే , అవినీతికి కల్వకుంట్ల కుటుంబం పేరొందిందని  రేవంత్ రెడ్డి  విమర్శించారు. 

దేశం  కోసం  గాంధీ కుటుంబం ప్రధానమంత్రి పదవిని కూడ వదులుకుందని  రేవంత్ రెడ్డి  తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారంగా  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  సోనియా గాంధీ కీలకంగా వ్యవహారించారని  రేవంత్ రెడ్డి  ప్రస్తావించారు. 

పదవులను, ప్రాణాలను త్యాగం చేయడంతో పాటు  ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమన్నారు. అలాంటి రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే  అర్హత లేదని వ్యాఖ్యానించడాన్ని  రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.  

మీరు అంటకాగే  నరేంద్ర మోడీకి  తెలంగాణలో పర్యటించే హక్కు ఉందా అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. పదేళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదని  రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు.  రాహుల్ గాంధీకి కాకుండా  తెలంగాణలో పర్యటించే అర్హత  ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  
 ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ  అమలు చేసిందని రేవంత్ రెడ్డి  గుర్తు  చేశారు. అసలు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు మీకుందా అని  ఆయన  ప్రశ్నించారు.   దేశంలో  ప్రధాన ప్రాజెక్టులను  నిర్మించిన  ఘనత  కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

పేదల  సంక్షేమం కోసం ఆర్టీఐ, ఆహార భద్రత, ఉపాధి హామీ చట్టాలను  కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని  రేవంత్ రెడ్డి  చెప్పారు.  ఎకరం ఆయకట్టుకు నీరిచ్చేందుకు  రూ. 45 వేలను  ఖర్చు చేయాల్సిన  పరిస్థితి నెలకొందన్నారు. 

click me!