పోలీసులు లేకుండా బయట తిరగలేరు: హరీష్ రావుపై రేవంత్ రెడ్డి

Published : May 05, 2022, 03:57 PM IST
పోలీసులు లేకుండా బయట తిరగలేరు: హరీష్ రావుపై రేవంత్ రెడ్డి

సారాంశం

పోలీసుల బందోబస్తు లేకుండా కేసీఆర్, హరీష్ రావు సహా టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా  రేవంత్ రెడ్డి హరీష్ రావు పై విమర్శలు చేశారు.

హైదరాబాద్: పోలీసుల బందోబస్తు లేకుండా రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి TRS నేతలకు ఉందని టీపీసీసీ చీఫ్ Revanth Reddy విమర్శించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా మంత్రి Harish Rao పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి హరీష్ రావు వ్యవసాయ పొలంలో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు హరీష్ రావు చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు ఉన్న ఫోటోను రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన సమయంలో Rahul Gandhi  తెలంగాణ రాస్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నావని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనానికి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ కు జత చేశారు.

 

పోలీసుల పహారా లేనిదే నీవు, నీ మామ Telangana లో తిరగలేని పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి హరీష్ రావుపై విమర్శలు చేశారు.  నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్ధం కావని రేవంత్ రెడ్డి మంత్రి హరీష్ రావను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, అర్హత నీకు లదేని మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్