భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం.. స్టేజ్ 2లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చెలరేగిన మంటలు

Published : May 05, 2022, 03:46 PM IST
భూపాలపల్లి కేటీపీపీలో మరో ప్రమాదం.. స్టేజ్ 2లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చెలరేగిన మంటలు

సారాంశం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో (KTPP) మరో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీపీపీ రెండో దశలోని 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో (KTPP) మరో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీపీపీ రెండో దశలోని 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యాష్ ఓవర్ ఫ్లో పంప్ మోటార్ పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే 10 రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. వరుస ఘటనలతో కార్మికులు భయాందోళనలు జరుపుతున్నారు. 

ఇక, గత నెల 25వ తేదీన కేటీపీపీలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర అయ్యాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.  కల్‌ మిల్లర్‌లో ఇనుప రాడ్డు రావడంతో కార్మికులు దానిని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డోర్‌ను తెరవడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగి కార్మికులకు అంటుకున్నాయి. 

ఈ ప్రమాదంలో గాయపడ్డ ఏడుగురిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆర్టిజన్ కార్మికుడు కేతిరి వీరస్వామి హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?