రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన వాయిదా.. వారిద్దరు వ్యతిరేకించడంతో...

Published : Apr 26, 2022, 02:20 PM IST
 రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన వాయిదా.. వారిద్దరు వ్యతిరేకించడంతో...

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి  నల్గొండ పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం.. రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. 

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి  నల్గొండ పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం.. రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే రేవంత్ పర్యటన వాయిదా పడినట్టుగా నల్గొండ డీసీసీ తెలిపింది. రేవంత్ పర్యటన తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఉమ్మడి  నల్గొండ జిల్లాకు చెందిన  కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వ్యతిరేకించడంతోనే రేవంత్ జిల్లా పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. 

ఇక, మే 6వ తేదీన వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం.. కరీంనగర్‌లో పర్యటించారు. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన నాయకుల, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,  జీవన్ రెడ్డి,  పొన్నం ప్రభాకర్.. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభను విజయంతం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. 

ఇక, నేడు ఖమ్మం జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే  ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల తొలగింపు వివాదం చోటుచేసుకుంది. రేవంత్ ఖమ్మం రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రేవంత్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆవేశంలో కొందరు కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడి చేయడంతో.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్