అసోం సీఎంపై మరోసారి ఫిర్యాదు, న్యాయ సలహా తీసుకోండి: రేవంత్ రెడ్డి

Published : Feb 16, 2022, 01:45 PM ISTUpdated : Feb 16, 2022, 01:46 PM IST
అసోం సీఎంపై మరోసారి ఫిర్యాదు, న్యాయ సలహా తీసుకోండి: రేవంత్ రెడ్డి

సారాంశం

అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై మరోసారి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: Assam CM పై తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ Revanth Reddy డిమాండ్ చేశారు.బుధవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

Rahul Gandhi పై అసోం సీఎం  Himanta Biswa Sarma  అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 48 గంలల పాటు Telangana పోలీసులకు సమయం ఇచ్చామన్నారు. కేసు నమోదు చేయకపోతే నిరసనలకు దిగుతామని కూడా హెచ్చరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
 Assam CM  హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించే ప్రయత్నం చేశారన్నారు. అయితే ఇవాళ ఉదయం వరకు కూడా అసోం సీఎం పై FIR  నమోదు చేయని విషయాన్ని పోలీసులు చెప్పారన్నారు.అంతేకాదు ఈ విషయమై న్యాయ సలహా తీసుకొంటున్నామని కూడా పోలీసులు చెప్పడంతో తాము పోలీస్ కార్యాలయాల ముట్టడికి పూనుకొన్నామన్నారు.

పోలీసుల ఉద్దేశ్యం సరిగా ఉంటే ఎఫ్ఐఆర్ లో 509 సెక్షన్ ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. 504,504 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. ఈ సెక్షన్ల కింద ఎప్ఐఆర్ తో ప్రయోజనం లేదన్నారు.  దీంతో మరోసారి తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ద్వారా  తన ఫిర్యాదు స్వభావాన్నే మార్చివేశారని రేవంత్ రెడ్డి వివరించారు. 153ఏ, 294, 505,(2) , 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని తాను ఫిర్యాదు చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.  కానీ పోలీసు అధికారులపై రాష్ట్రంలోని పెద్దల నుండి ఏమొచ్చిందో తనకు తెలియదన్నారు. అసోం సీఎంపై రెండు నామమాత్రపు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

అసోం సీఎం పై హిమంత బిశ్వశర్మపై Legal opinion సలహా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.  అసోం సీఎంపై తాను డిమాండ్ చేసిన సెక్షన్ల మేరకు కేసులు నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


Uttarakhand Assembly Election 2022 ప్రచారంలో భాగంగా అసోం సీఎం ఈ నెల 11వ తేదీన రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016లో Pakistan పై జరిగిన Surgical Strike కు సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.ఈ విషయమై హిమంత బిశ్వశర్మ స్పందించారు.  రాహుల్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తనయుడే అని చెప్పడానికి ఆధారాలు అడగలేదు కదా అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu