రాష్ట్రంలో గవర్నర్ రూల్ పెడితే మంచిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.గురువారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: రాష్ట్రంలో గవర్నర్ రూల్ పెడితే మంచిదని TPCC చీఫ్ Revanth Reddy చెప్పారు. గురువారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 8 Governor చేతిలో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
అవసరమైతే ప్రభుత్వాన్ని తీసివేయొచ్చు కదా అని ఆయన చెప్పారు. minor girls పై అత్యాచారాలు జరిగితే జరిగితే ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు.పీసీసీ చీఫ్ లేకపోయినా చింతన్ శిబిర్ జరుగుతుందన్నారు. ఎవరూ ఉన్నాలేకున్నా పనులు జరుగుతాయని చెప్పారు.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహిళా దర్భార్ నిర్వహించడంపై రాజకీకుంగా దుమారం రేగుతుంది. టీఆర్ఎస్ ఈ విషయాన్ని తప్పుబడుతుంది. గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు.
undefined
ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మహిళా దర్బార్ ను నిర్వహించనున్నట్టుగా రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో వరుస అత్యాచారాలు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. హైద్రాబాద్ అమ్నేషియా పబ్ తో పాటు మరికొన్ని ఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ తరుణంలో గవర్నర్ మహిళ దర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు మహిళా దర్బార్ ను ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. మహిళా దర్బార లో పాల్గొనే వారు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్ మెంట్ కోసం 040- 23310521 నెంబర్ కు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోవాలని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి.
also read:జూన్ 10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్: తెలంగాణ గవర్నర్ తమిళి సై నిర్ణయం
హైద్రాబాద్ Jubilee hills రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. గవర్నర్ పై మంత్రుల, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానపరుస్తుందని గవర్నర్ ఆరోపణలు చేసింది. తాను అనేక ఇబ్బందులు పడుతూనే రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నానని గవర్నర్ ప్రకటించారు. ఈ నెల 2 వ తేదీన రాజ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలను గవర్నర్ చేశారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తాను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె చెప్పారు
తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య కొంత కాలంగా అగాధం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆమె ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిశారు. వారితో భేటీ అయిన తర్వాత తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా అమానపరుస్తుందన్నారు.