ఈటలను కలిశాను .. కానీ, నీలాగా చీకట్లో కాదు, ఫోటోలు పంపుతా చూసుకో: కేటీఆర్‌ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

Siva Kodati |  
Published : Oct 23, 2021, 05:35 PM IST
ఈటలను కలిశాను .. కానీ, నీలాగా చీకట్లో కాదు, ఫోటోలు పంపుతా చూసుకో: కేటీఆర్‌ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

సారాంశం

కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని.. నీలాగా చీకట్లో కలవలేదంటూ ఆరోపించారు. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఎవరిదో కిషన్ రెడ్డి (kishan reddy) చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు

హుజురాబాద్ ఉపఎన్నికలో రేవంత్‌తో ఈటల రాజేందర్ కుమ్మక్కయ్యారంటూ మంత్రి కేటీఆర్ చేసిన  వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని.. నీలాగా చీకట్లో కలవలేదంటూ ఆరోపించారు. ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఎవరిదో కిషన్ రెడ్డి (kishan reddy) చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. విమానం వివరాలు నువ్వు చెప్తావా.. నన్ను చెప్పమంటావా అని ఆయన ప్రశ్నించారు. తాను గాడ్సేను (nathuram godse) కాదని.. ఢిల్లీలో వున్న అమిత్ షానే (amit shah) గాడ్సే అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు (kcr) గాడ్ ఫాదర్ ఢిల్లీలో వున్న గాడ్సే అంటూ ఆయన ఆరోపించారు. కేటీఆర్.. నువ్వు ఫోటోలు పంపడం కాదు మేమే పంపుతాం చూసుకో అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. 

అంతకుముందు టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు బీజేపీ (bjp) నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender)  రాజీనామా చేశాకే రేవంత్‌ను కలిశానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్‌ను తాను కలిస్తే తప్పేంటని ఈటల ప్రశ్నించారు. రేవంత్‌నే కాకుండా ఆ సమయంలో అన్ని పార్టీల నేతలను కలిశానని రాజేందర్ వెల్లడించారు. 

ALso Read:Huzurabad bypoll: రేవంత్ రెడ్డిని ఈటల రహస్యంగా కలిశారని కేటీఆర్ వ్యాఖ్య

కాగా.. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ Huzurabad bypollలో పోటీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈటల రాజేందర్ రహస్యంగా కలిశారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 

నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల్లో బిజెపి డమ్మీ అభ్యర్థిని దింపి కాంగ్రెసుకు సహకరించిందని KTR ఆరోపించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ లోకసభ సీట్లలో కూడా గతంలో కాంగ్రెసు ఓట్లు బిజెపికి బదిలీ అయ్యే విధంగా అవగాహనకు వచ్చాయని ఆయన చెప్పారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా బిజెపి, కాంగ్రెసు కలిశాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ డబ్బులకు అమ్ముడుపోయారని ఆయన అన్నారు. గాంధీ భవన్ లో గాడ్సేలు దూరారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెసులో అగ్రతాంబూలం ఇస్తున్నారని అమరీందర్ సింగ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?