తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్... వనదేవతలకు మొక్కు చెల్లించిన సీతక్క

Arun Kumar P   | Asianet News
Published : Jun 29, 2021, 02:36 PM ISTUpdated : Jun 29, 2021, 02:39 PM IST
తెలంగాణ పిసిసి చీఫ్ గా రేవంత్... వనదేవతలకు మొక్కు చెల్లించిన సీతక్క

సారాంశం

తెలంగాణ పిసిసి చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో ఆయనను సొంత అన్నలా భావించే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వనదేవతలకు మొక్కు చెల్లించుకున్నారు. 

వరంగల్: చాలా రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన నేపథ్యంలో ఆయనను సొంత అన్నలా భావించే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అమ్మవార్లకు మొక్కు చెల్లించుకున్నారు. భారీ ఊరేగింపుగా వెళ్లి మేడారం సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్న సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకున్నారు ములుగు ఎమ్మెల్యే.  

 

''పిసిసి అధ్యక్షులుగా నియమితులైన రేవంత్ రెడ్డి అన్నకు గిరిజన దేవుళ్ల ఆశిస్సులతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశిస్సులు కూడా వుండాలని కోరుకున్నా'' అంటూ ట్విట్టర్ వేదికన సీతక్క అభినందనలు తెలియజేస్తూనే ఆల్ ది బెస్ట్  చెప్పారు. 

read more  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

 రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా అందరినీ కలుపుకుపోతూ రేవంత్ రెడ్డి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే