బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను సమాజానికి చెప్పేందుకే రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులను వరి పండించవద్దని కోరిన కేసీఆర్... తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరిని పండిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. తాను పండించిన పంటను కేసీఆర్ ఎక్కడ విక్రయిస్తే తెలంగాణ రైతులు కూడా అక్కడే విక్రయిస్తారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి చాటి చెప్పేందుకు తాను Erravalli లో రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టానని రేవంత్ రెడ్డి చెప్పారు.ఎర్రవల్లి ఎక్కడ ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎర్రవల్లి పాకిస్తాన్ లో ఉందా, చైనాలో ఉందా అని ఆయన అడిగారు. ఎర్రవల్లికి వెళ్లేందుకు వీసా కావాలా అని ఆయన ప్రశ్నించారు. ఎర్రవల్లికి వెళ్లకుండా తమ పార్టీ కార్యకర్తలు, నేతలను రాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారన్నారు. ఎర్రవల్లిలో ఆటంబాంబులు, అణుబాంబులు లేవన్నారు.
also read:ఉద్యమంలో లేనోళ్లు ఇప్పుడు ఉద్యోగాలని డ్రామాలాడుతున్నరు - ప్రభుత్వ విప్ బాల్క సుమన్
undefined
ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేసిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేసిన తర్వాత సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై ఢిల్లీలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకొంటానని చెప్పి వెళ్లిన కేసీఆర్. ఉత్త చేతులతోనే hyderabad కు తిరిగి వచ్చారన్నారు.
Paddy ధాన్యం కొనుగోలు విషయమై రైతుల నుండి వచ్చిన తిరుగుబాటును చూసిన కేసీఆర్ హుటాహుటిన మంత్రులను, ఎంపీలను ఢిల్లీకి పంపారని Revanth reddy చెప్పారు.bjp, trsలు తెలంగాణలో సునీల్ అనే వ్యూహాకర్తను నియమించుకొన్నారన్నారు. ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా టీఆర్ఎస్, బీజేపీలు రైతాంగం సమస్యను పక్కదారి పట్టించేందుకు గాను వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదికి తెచ్చారన్నారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని బీజేపీ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. నిరుద్యోగులను కూడా నిండా ముంచిన చరిత్ర కేసీఆర్, మోడీలదేనని ఆయన చెప్పారు. ప్రజల వ్యతిరేకత నుండి తప్పించుకొనేందుకు గాను టీఆర్ఎస్ వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని, బీజేపీ నిరుద్యోగ సమస్యను తెర మీదికి తెచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
రైతుల తరపున తమ పార్టీ అండగా నిలుస్తోందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ , బీజేపీనే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని నాటకాలు ఆడినా కూడా ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మరని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ నేతలవి ఉత్తరకుమార ప్రగల్బాలని ఆయన చెప్పారు.సమస్యను పక్కదారి పట్టించేందుకు నిరుద్యోగ దీక్షను బీజేపీ పట్టుకుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ ససమ్య ఈనాటిదా అని ఆయన ప్రశ్నించారు.