అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయమంటున్నా: రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Aug 8, 2021, 4:04 PM IST
Highlights

పథకాలు రావాలంటే ఉప ఎన్నికలు రావాలన్నట్లు ఆనవాయితీ అయ్యిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నానని రేవంత్ పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. 

నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటి ఇంద్రవెల్లి సభ విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రేవంత్ ఆరోపించారు. పథకాలు రావాలంటే ఉప ఎన్నికలు రావాలన్నట్లు ఆనవాయితీ అయ్యిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నానని రేవంత్  పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారని ఆయన తెలిపారు. 

Also Read:ఇంద్రవెల్లితో నీకు సంబంధం ఏంటీ, నిర్మల్‌ వరకు చూసుకో : మహేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి వార్నింగ్

 కేసీఆర్‌ ఏడున్నరేళ్ల పాలనలో.. దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 9న సాయంత్రం 3 గంటలకు ఇంద్రవెల్లిలో తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇంద్రవెల్లి గడ్డ మీద దండు కట్టి దండోరా మోగించబోతున్నామని.. తెలంగాణ సమాజమంతా కదిలి కేసీఆర్‌పై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ పిలుపునిచ్చారు.
 

click me!