మా మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దు:కేసీఆర్‌కు రేవంత్ సవాల్

By narsimha lodeFirst Published Feb 21, 2023, 2:13 PM IST
Highlights


వరంగల్ లో   యూత్ కాంగ్రెస్ నేత పవన్ కుమార్పై దాడికి దిగిన  వారిని కఠినంగా  శిక్షించాలని   కాంగ్రెస్ డిమాండ్  చేస్తుంది. ఇవాళ  పవన్ కుమార్ ను  రేవంత్ రెడ్డి  పరామర్శించారు.  

హైదరాబాద్: తమ  మౌనాన్ని  చేతకానితనంగా  భావించవద్దని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెప్పారు.మంగళవారంనాడు  వరంగల్ లో  యూత్ కాంగ్రెస్ నేత పవన్ కుమార్ ను  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  పరామర్శించారు. అనంతరం  ఆయన మీడియాతో మాట్లాడారు.  

పవన్  ను చంపాలని  చూశారని  ఆయన ఆరోపించారు.  పవన్ పై దాడికి  ఎమ్మెల్యే  వినయ్ భాస్కర్  సూత్రాధారిగా  రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు.  ఎమ్మెల్యేపై  హత్యాయత్నం  కేసు పెట్టాలని ఆయన డిమాండ్  చేశారు.  

తాము తలుచుకుంటే  కేసీఆర్  రేపటి నుండి  ఏ ఊళ్లో  ఒక్క  సభ కూడా  పెట్టలేడని  రేవంత్ రెడ్డి   చెప్పారు.  దాడులే ప్రాతిపదికగా  రాజకీయం చేద్దామంటే కేసీఆర్ తేదీ, స్థలం ప్రకటించాలని  ఆయన  కేసీఆర్  ను కోరారు.  కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా ,, వరంగల్ హంటర్ రోడ్డైనా  ఎక్కడైనా  తాము చర్చకు సిద్దమేనని  రేవంత్ రెడ్డి  తెలిపారు. 

also read:హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నేతపై దాడి.. ఎమ్మెల్యే అనుచరుల పనేనని ఆరోపణలు.. టెన్షన్ వాతావరణం.

సోమవారంనాడు  వరంగల్  లో  రేవంత్ రెడ్డి పాదయాత్ర  సాగింది. వరంగల్  పశ్చిమ నియోజకవర్గ  ఎమ్మెల్యే   వినయ్ భాస్కక్ కు  వ్యతిరేకంగా  ఫ్లెక్సీని ఏర్పాటు  చేశారని   పవన్ కుమార్ పై  ఎమ్మెల్యే వర్గీయులు దాడులకు  దిగారని  కాంగ్రెస్ నేతలు  ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి  కాంగ్రెస్ నేతలు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.   యూత్ కాంగ్రెస్ నేత  పవన్ కుమార్ పై దాడికి పాల్పడిన  నిందితులపై  చర్యలు తీసుకోవాలని  కాంగ్రెస్ నేతలు  డిమాండ్  చేస్తున్నారు.   పవన్ కుమార్ ను పరామర్శించిన తర్వాత  రేవంత్ రెడ్డి వరంగల్ కమిషనర్ ను కలిసి  వినతిపత్రం  సమర్పించారు.  పవన్ పై దాడికి దిగిన  వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు. 

హత్  సే హత్ జోడో  అభియాన్  కార్యక్రమంలో  భాగంగా  రేవంత్ రెడ్డి  పాదయాత్ర  నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర  వరంగల్  లో సాగుతున్న తరుణంలో  యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై దాడి  జరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా  కాంగ్రెస్ నేతలు  పాదయాత్రలకు సిద్దమౌతున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు  రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్రలను ప్రారంభించనున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు  వచ్చిన  పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాగూర్ ఈ  పార్టీ నేతలతో  చర్చించారు.  

click me!