బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకున్నానా.. భాగ్యలక్ష్మీ టెంపుల్‌లో ప్రమాణం చేద్దామా : ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

By Siva KodatiFirst Published Apr 21, 2023, 5:40 PM IST
Highlights

తాను బీఆర్ఎస్ నుంచి డబ్బు తీసుకున్నట్లుగా బీజేపీ ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేపు భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేద్దామని.. అక్కడికి రావాలని సవాల్ విసిరారు. 

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోలేదని తాను ప్రమాణం చేస్తానని.. ఈటల కూడా చేయాలన్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వస్తానని.. ఈటల కూడా రావాలన్నారు. 

అంతకుముందు శుక్రవారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదనీ, ఎన్నికల ముందైనా.. తర్వాతైనా రెండు పార్టీలు కలిసే ఉంటాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ 25కోట్లు పంపించారని సంచలన ఆరోపించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా అమిత్ షా చేవేళ్ళ సభలో పాల్గొంటారని వెల్లడించారు. దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంతా వేల కోట్లు ఎలా సంపాదించారో  సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Videos

Also Read: కాంగ్రెస్ గెలిచినా సీఎం అయ్యేది కేసీఆరే .. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై బీఆర్ఎస్ విషం కక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి మైన్స్ ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం మానుకోవాలని, సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీ రామగుండంలో మాటిచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నైనీ బ్లాక్, తాడిచర్ల మైన్స లను ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారని ఆరోపించారు.  

సింగరేణి లాభాల్లో ఉంటే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు బిడ్ వేయలేదో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రలో ఉన్న వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను కాదు.. తెలంగాణ ప్రజలకు ఉపయోగంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీని (RTC) కాపాడాలని హితవుపలికారు. సీఎం కేసీఆర్ పుణ్యాన నాలుగు వేల ఆర్టీసీ బస్సులు ఖతమయ్యాయని విమర్శించారు. మరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవటం లేదని నిలాదీశారు.
 

click me!