ఢిల్లీ పెద్దలకు కాదు..  ప్రజలకు గులాంగిరి చేస్తాం.. : మంత్రి హరీష్ రావు 

Published : Apr 21, 2023, 05:24 PM ISTUpdated : Apr 21, 2023, 05:31 PM IST
ఢిల్లీ పెద్దలకు కాదు..  ప్రజలకు గులాంగిరి చేస్తాం.. : మంత్రి హరీష్ రావు 

సారాంశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పతకాలను కేంద్ర ప్రభుత్వాలు కాపీ చేస్తుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గులాం గిరి చేస్తుందే తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని ఆయన స్పష్టం చేశారు. 

Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఢిల్లీ వారికి గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని, కానీ బీఆర్‌ఎస్ వాళ్లు కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే గులాంగిరి చేస్తారని మంత్రి హరీష్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రచారాన్ని తిప్పి కొట్టాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు సూచించారు. స్వరాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలని అన్నారు.

రాష్టంలో పార్టీలను రెండు పర్యాయాలు నిలబెట్టిన వాళ్లలో ఒకరు ఎన్టీఆర్‌ అయితే..  మరొకరు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని మంత్రి ఆరోపించారు. దేశంలో మార్పు కోసం.. సీఎం కేసీఆర్ బయలుదేరారని, మన నినాదం రైతు నినాదమని తెలిపారు. గులాబీ పార్టీ తెలంగాణ ప్రజానీకానికి తప్ప ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేయదని అన్నారు. ఇతర పార్టీలు 60 యేండ్లలో చేసిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ 6 ఏండ్లలో చేసి చూసించారని ప్రశంసించారు. అభివృద్ధిలో 60 ఏళ్ల వెనుక ఉన్న గజ్వేల్‌ను 60 ఏళ్ళు ముందుకు కేసీఆర్ తీసుకెళ్లారని కొనియాడారు.

గజ్వేల్ ప్రజల బతుకులు మారాయనీ, రింగు రోడ్డు, పార్కులు, రైల్వేస్టేషన్, డ్యాములను తెచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్  గజ్వేల్ కు రాకముందు యాసంగిలో 7వేల ఎకరాల భూమి సాగు చేసేవారనీ..  ఇప్పుడు ఆ లెక్క మారిందనీ, దాదాపు 17వేల ఎకరాల భూమిలో సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ను వేరే జిల్లాల్లో పోటీ చేయాలని ఇతర నాయకులు అడుగుతున్నారని, మరీ కేసీఆర్‌ను వేరే దగ్గరకు పంపించడానికి గజ్వేల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారా ?అని మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్