బండి సంజయ్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు: మోత్కుపల్లి

Published : Jun 29, 2021, 12:47 PM ISTUpdated : Jun 29, 2021, 12:56 PM IST
బండి సంజయ్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు: మోత్కుపల్లి

సారాంశం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని  ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  విమర్శించారు. 


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని  ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  విమర్శించారు. మంగళవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు రోజుల క్రితం సీఎం దళిత్ ఎంపర్‌మెంట్ స్కీమ్ పై సీఎం ఏర్పాటు చేసిన సమావేశం గురించి ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి తాను వెళ్లి పార్టీని బతికించానని చెప్పారు. ఒకవేళ తాను ఈ సమావేశానికి హాజరుకాకపోతే బీజేపీ దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడేదన్నారు. బీజేపీ వ్యక్తిగానే తాను ఈ సమావేశానికి హాజరైనట్టుగా ఆయన వివరించారు. పార్టీలోని కొందరు నేతలు బండి సంజయ్ ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

వ్యాపారాల కోసం పార్టీలు మారే వ్యక్తులతో నీతులు చెప్పించుకొనే స్థితిలో తాను లేనని ఆయన తేల్చి చెప్పారు. మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నా.. భవిష్యత్తులో కూడ పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్టీ చర్యలు తీసుకొంటే అప్పుడు చూద్దామన్నారు. కేసీఆర్ కు దగ్గర కాలేదు... అదే సమయంలో దూరం కూడ కాలేదని నర్సింహులు చెప్పారు. ఏ ప్రభుత్వం మంచి చేసినా ఆ మంచిని స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana