ఆ వార్తలు నిజం కాదు... ఉత్తమ్ కుమార్ క్లారిటీ

Published : Jun 05, 2019, 01:51 PM IST
ఆ వార్తలు నిజం కాదు... ఉత్తమ్ కుమార్ క్లారిటీ

సారాంశం

టీపీసీసీ ఛైర్మన్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా... ఆ వార్తలపై బుధవారం ఉత్తమ్ కుమార్ స్పందించారు. 

టీపీసీసీ ఛైర్మన్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా... ఆ వార్తలపై బుధవారం ఉత్తమ్ కుమార్ స్పందించారు. ఈ రోజు నల్లొండలో ఉన్న ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.

తాను తెలంగాణ పీసీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.పీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటామని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్య పద్మావతికి ఆసక్తి లేదని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Medaram Jatara: మేడారం వెళ్లలేక‌పోతున్నారా.? ఏం ప‌ర్లేదు ప్ర‌సాదం మీ ఇంటికే వ‌స్తుంది. ఎలాగంటే..
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు.. ఎలా ఉండనున్నాయో తెలుసా..?