సాగర్ ఉప ఎన్నిక: ముగిసిన నామినేషన్‌ల ఉపసంహరణ గడువు.. బరిలో 41 మంది

By Siva KodatiFirst Published Apr 3, 2021, 5:07 PM IST
Highlights

నాగార్జునసాగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.  

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మొత్తం 72 మంది అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇందులో వివిధ పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు కూడా ఉన్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం 3 రోజుల గడువిచ్చింది. ఈ నెల 1 నుంచి ఇవాళ్టి వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పంచింది. రెండో రోజున ముగ్గురు, చివరి రోజున 16 మంది తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్‌, బీజేపీ నుంచి రవికుమార్‌ నాయక్‌ బరిలో ఉన్నారు. అక్టోబర్ 17న నాగార్జున సాగర్‌‌లో పోలింగ్ జరగనుండగా, మే 2న ఫలితం తేలనుంది. 
 
click me!