రేపు ఓవైసీ-మిధాని ఫ్లై ఓవర్ హైదరాబాద్ ప్రజలకు అంకితం.. కేటీఆర్ ట్వీట్..

Published : Dec 27, 2021, 01:01 PM IST
రేపు ఓవైసీ-మిధాని ఫ్లై ఓవర్ హైదరాబాద్ ప్రజలకు అంకితం.. కేటీఆర్ ట్వీట్..

సారాంశం

ఈ ఫ్లై ఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని.. ఈ ఫై ఓవర్ ను 80 కోట్ల వ్యయంతో GHMC నిర్మించిందని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం #SRDP కింద ఈ నిర్మాణం జరిగిందన్నారు. ఈ మేరకు  SRDP బృందానికి నా అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ఓవైసీ-మిధాని జంక్షన్‌లో కొత్తగా నిర్మించిన 1.365 కి.మీ పొడవైన ఫ్లై ఓవర్‌ను రేపు హైదరాబాద్ ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర, పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు.

ఈ ఫ్లై ఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని.. ఈ ఫై ఓవర్ ను 80 కోట్ల వ్యయంతో GHMC నిర్మించిందని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం #SRDP కింద ఈ నిర్మాణం జరిగిందన్నారు. ఈ మేరకు  SRDP బృందానికి నా అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

ఇదిలా ఉండగా, ఇటీవల బీజేపీ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కేటీఆర్ మండిపడ్డారు. 

Moinabad Road Accident : మొయినాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ అరెస్ట్..

‘‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? himanshu శరీరంలోనా..? అంటూ ’’ తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా అర్థంలేని విషయాలను ప్రచారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?