
హైదరాబాద్ : సీఎం KCR కేంద్రంలో ఎన్డీఏ పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన mumbai వెళ్లి మహారాష్ట్ర సీఎం Uddhav Thackeray, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలను కలిశారు. కేసీఆర్ మాజీ ప్రధాని దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నేతల నుంచి కూడా మద్దతు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇదే విషయంపై Delhi వెళ్లాలని భావించారు. అయితే, పలు కారణాల వల్ల నేటి పర్యటన వాయిదా పడింది.
రేపు కేసీఆర్ తెలంగాణ.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, పలువురు నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారని సీఎం వర్గాలు తెలిపాయి. ఆయన ఢిల్లీలో ఏయే నేతలతో సమావేశంలో పాల్గొంటారో తెలియాల్సి ఉంది. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుండి సంప్రదింపులు సాగిస్తున్నారు. అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు.
కాగా, కేంద్రం సహకరించకపోయినా ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ నిన్న సిద్దిపేటలో అన్నారు. ఇటీవల తను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో సమావేశమైన సమయంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. త్వరలోనే తాను తెలంగాణలో పర్యటించి రెండు మూడు పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తామని takrai తెలిపిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను బుధవారం నాడు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాదులో మతకల్లోలాలు జరుగుతాయని ప్రచారం చేశారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా మతకల్లోలాలు చోటుచేసుకోలేదు అన్నారు. ఎక్కడికి అక్కడే మత క్యాన్సర్ వ్యాపింప చేయకుండా కట్టడి చేయాలని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. మతకల్లోలాలు జరిగితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పెట్టుబడులు పెడతారని కేసీఆర్ చెప్పారు.
దేశంలో జుగుప్స కలిగించే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. దేశం దారి తప్పుతుంది అని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని కెసిఆర్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో విద్యాసంస్థలను మూసేసే పరిస్థితి నెలకొందన్నారు. కర్ణాటకలో మతకల్లోలాలు సృష్టించాలని కేసీఆర్ విమర్శించారు. దీంతో చదువుకునేందుకు వెళ్లేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని అన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కేంద్రం సహకరించక పోయినా కూడా పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
రైతు బంధు, రైతు బీమా తోపాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్స్, కళ్యాణ లక్ష్మి పలు పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బెంగళూరు నుండి 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాగుతున్నాయన్నారు. తెలంగాణ నుండి లక్ష కోట్లు ఎగుమతులున్నాయన్నారు. మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు.