
నెల్లికుదురు : ఆమె వయసు 20 ఏళ్లు. ఊర్లోనే ఉంటున్న ఓ స్నేహితురాలి ఇంటికి నిద్రించేందుకు night ఎనిమిదిన్నర గంటల సమయంలో వెళ్లిన ఆమె పావుగంటలోనే బయటకు వచ్చేసింది. కానీ తన ఇంటికి మరో ఆరు గంటల తర్వాత చేరుకుంది. ఉదయమే పురుగుల మందు తాగి suicide attempt చేసింది. ఐదు రోజుల పాటు చికిత్స పొంది ప్రాణాలు విడిచింది.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. మరి ఆ రాత్రి స్నేహితురాలు ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా ఇంటికి ఎందుకు వెళ్లలేకపోయింది? ఆరు గంటల్లో ఆమెపై ఏదైనా దారుణం జరిగి ఉంటుందా? ఈ అనుమానాలు తొలుస్తున్న తరుణంలోనే ఆమె రాసినట్లుగా చెబుతున్న ఓ suicide note బయటికి వచ్చింది. ఆ గ్రామానికే చెందిన ముగ్గురు యువకుల పేర్లను వ్రాసిన బాధితురాలు, వారంతా కలిసి తనను ఆగం చేశారని చీటీలో పేర్కొంది.
దీంతో ఆ ముగ్గురు యువకులు ‘ఆ రాత్రి’ ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారనే అనుమానాలు బలపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్ దాకా చదివి మానేసింది. కానిస్టేబుల్ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. యువతి తల్లి రెండేళ్ల క్రితమే మృతి చెందింది. తండ్రి కూలి పనులకు వెళుతుంటాడు. ఈనెల 16న ఆమె గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి నిద్రించేందుకు వెళ్లి, తిరిగి 17న ఉదయం ఇంటికి వచ్చింది.
మళ్లీ అదే రోజు రాత్రి 8 గంటలకు స్నేహితురాలి ఇంటికే వెళ్లి, పదిహేను నిమిషాలకే బయటకు వచ్చేసింది. అయితే తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఇంటికి చేరుకుంది.18న ఉదయం ఎనిమిది గంటలకు పురుగుల మందు తాగింది. ఇది గమనించిన సోదరుడు వెంటనే ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచింది. కాగా, యువతిపై ఓ రాత్రంతా అత్యాచారం జరగడంతో పురుగుల మందు తాగినట్లు తెలిసిందని ఎస్పీ పేర్కొన్నారు.
బెడ్ మీదనే పిన్ని చేతికి కాగితం ఇచ్చి…
యువతి మృతి మృతి చెందిన తర్వాత ఓ సూసైడ్ నోట్ బయటికి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలు ఓ కాగితంపై రాసి ఇచ్చిందని ఆమె పిన్ని పేర్కొంది. ఆ కాగితంలో ‘యాట సాగర్, నజీం, జగదీష్ అంతా ఆగం చేశారు. నా బాధ ఎవరికీ చెప్పుకోలేక.. చెప్పు తీసుకుని కొట్టాలి వీళ్లందరినీ..’ అని రాసి ఉంది. ముగ్గురిలో నజీం అనే యువకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త. కాగా, మిగతా ఇద్దరు లీడర్ గిరీ చేస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
తన బిడ్డను ఆగం చేసి.. ఆమె ఆత్మహత్య కారణమైన ముగ్గురు యువకులను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం నివేదిక అందాల్సి ఉంది. కాగా ఆసుపత్రికి మంత్రి ఎర్రబెల్లి విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. యువతిపై ముగ్గురు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది అని.. వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.