ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. అయితే జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక, జయసుధ విషయాని వస్తే అనేక చిత్రాలలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలు పోషించారు. కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ విజయం సాధించలేకపోయారు. ఇక, జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ చాలా వరకు ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసుధ భంగపడ్డారు. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిన ఆమె సినిమాల్లో తిరిగి బిజీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జయసుధ సొంత గూటికి రావాలని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.