అది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది... : హరీష్ రావు

By SumaBala BukkaFirst Published Jan 11, 2024, 7:22 PM IST
Highlights

తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో చాలా కష్టపడాలని, నేతలు చెబుతున్న అంశాలన్నింటినీ చర్చిస్తామని అన్నారు. నెల రోజుల్లో కేసీఆర్ కూడా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారని.. మిగతా నేతలు కూడా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటామని తెలిపారు. 

హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన మొదటి శాసనసభ సమావేశంలో కాంగ్రెస్ కు చూపించింది ట్రైలర్ మాత్రమేనని… అసలు సినిమా ముందు ముందు ఉంటుందంటూ బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే,  మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఈసారి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.  కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. డిసెంబర్లో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది.

ఈ సమావేశాల్లో  అధికార పార్టీపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు  గట్టిగా విమర్శలు చేశారు. ఈ విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కౌంటర్ కూడా ఇచ్చారు. ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే విషయాన్ని చెబుతూ.. తాను పదవీస్వీకారం చేసిన తరువాత…రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకునేలోపే బీఆర్ఎస్ నేతలు.. బావమరుదులైన హరీష్ రావు, కేటీఆర్ లు విమర్శలతో దాడి చేశారని  అన్నారు.

Latest Videos

బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

ఈ క్రమంలోనే హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గురువారం జరిగిన సమావేశంలో హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో చాలా కష్టపడాలని, నేతలు చెబుతున్న అంశాలన్నింటినీ చర్చిస్తామని అన్నారు. నెల రోజుల్లో కేసీఆర్ కూడా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటారని.. మిగతా నేతలు కూడా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటామని తెలిపారు. 

 నేతలకు ఏ ఒక్కరికి సమస్య వచ్చినా..  బస్సు వేసుకుని వచ్చి మరి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయని వారిలో వారికే పడడం లేదని విమర్శించారు. విద్యుత్తులో అవినీతి, కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఆదుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని.. అక్రమ కేసుల నుండి కాపాడడానికి లీగల్సేల్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. 

click me!