గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబు

First Published Jul 30, 2018, 11:09 AM IST
Highlights

తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు, సామాజిక సేవలోను వెనుకడుగు వేయమని నిరూపిస్తున్నారు తెలుగు సినీ నటులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ పేరిట రాజకీయ నాయకులు ఒకరితో ఒకరు చెట్లను నాటించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఛాలెంజ్ ఇపుడు సినీ ఇండస్ట్రీకి పాకింది. కొందరు నాయకులు విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, హీరో మోహన్ బాబు స్వీకరించారు.
 

తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు, సామాజిక సేవలోను వెనుకడేగు వేయమని నిరూపిస్తున్నారు తెలుగు నటులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ పేరిట రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు చెట్లను నాటించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఛాలెంజ్ ఇపుడు సినీ ఇండస్ట్రీకి పాకింది. కొందరు నాయకులు విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, హీరో మోహన్ బాబు స్వీకరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రిలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆయన మరో ముగ్గురు ప్రముఖులకు ఈ ఛఆలెంజ్ విసిరారు. తెలుగు సినీ హాస్యనటులు బ్రహ్మనందం, దర్శకులు వివి వినాయక్, పోలీస్ కమిషనర్ కార్తీకేయకు ఈ చెట్లను నాటమంటూ సవాల్ చేశారు.ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను నటులు బ్రహ్మానందం స్వీకరించారు. తన నివాసంలో మొక్కలు నాటి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.  ఈ గ్రీన్ ఛాలెంజ్ లో తనను భాగస్వామ్యం చేసినందుకు జీవన్ రెడ్డికి బ్రహ్మానందంకు ట్విటర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

ఇక మంత్రి కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన యుఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా, ఈ ఛఆలెంజ్ కు సీనియ‌ర్ న‌టుడు మోహన్‌బాబును నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కూడా ఈ ఛఆలెంజ్ కు స్పందిస్తూ మొక్కలు నాటారు. ఈ పోటోలను జతచేస్తూ 'గ్రీన్ ఛాలెంజ్‌ను పూర్తి చేశా. విద్యానికేతన్‌లోని మా పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరుతున్నా' అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.

 

click me!