టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖ సినీనటి

Published : Sep 15, 2018, 05:23 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రముఖ సినీనటి

సారాంశం

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్ని తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ముందస్తు  ఎన్నికల్లో  అభ్యర్థులను ప్రకటించడంలో, ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో టీఆర్ఎస్ పార్టీ ఇతరపార్టీల కంటే ముందుంది. అంతేకాదు సినీ గ్లామర్ ను వాడుకోవడంలో కూడా ఈ పార్టే ముందుంది. ఇప్పటికే తెలుగు టీవి సీరియల్ నటుడు, యాంకర్ జేఎల్ శ్రీనివాస్ ను పార్టీలో చేరగా... తాజాగా మరో సినీ నటి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.  

పలు సినిమాల్లోనూ, టీవి సీరియళ్లలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉమాదేవి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కూకట్ పల్లి మాజీ ఎమ్మల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కూకట్ పల్లి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు మాధవరం. 

ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.  పార్టీని బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతే కాకుండా రానున్న ఎన్నికల్లో కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం కోసం కృషి చేస్తానని ఉమాదేవి అన్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?