అశ్లీల ఫోటోలతో మహిళా మేనేజర్‌‌పై వేధింపులు...అదే సంస్థ ఉద్యోగి నిర్వాకం

Published : Sep 15, 2018, 04:32 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
అశ్లీల ఫోటోలతో మహిళా మేనేజర్‌‌పై వేధింపులు...అదే సంస్థ ఉద్యోగి నిర్వాకం

సారాంశం

ఆమె ఆ కంపనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆమె వద్ద ఓ యువకుడు హెల్పర్ గా పనిచేసేవాడు. అయితే ఆ మహిళా ఉన్నతాధికారిపై కన్నేసిన యువకుడు రహస్య బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. ఆమె పోటోలను సేకరించి వాటిని మార్పింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు పంపించి తన కోరిక తీర్చకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే ఆ బెదిరింపులకు భయపడకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు.

మెదక్ జిల్లాకు చెందిన వంజరి సురేష్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. కుత్బుల్లాపూర్ లో నివాసముంటూ కొంపల్లిలోని ఓ కంపనీలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు అదే కంపనీలో పనిచేసే ఓ మహిళా అధికారినిపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని భావించి ఓ పథకం రచించాడు. ఇందులో భాగంగా సోషల్ మీడియా నుండి ఆమె ఫోటోలను సేకరించి, వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని ఆ మహిళా అధికారికి వాట్సాప్ ద్వారా పంపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనను ఒంటరిగా కలవాలంటూ డిమాండ్ చేశాడు. లేదంటే ఈ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని  బెదిరించాడు. 

అయితే ఈ బెదిరింపులకు భయపడకుండా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు సురేష్ ను పట్టుకున్నారు. అతడి వద్దగల స్మార్ట్ పోన్ ను స్వాతీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్