సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తన వంతు సాయంగా రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని బ్లడ్ బ్యాంకులో మెగాస్టార్ బ్లడ్ డొనేషన్ చేశారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్‌డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గుతున్నాయి. ఎక్కడా బ్లడ్ డోనేషన్ క్యాంపులు జరగడం లేదు.. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం కూడా ఈ తరహా కార్యక్రమాలను నిషేధించింది.
ఈ క్రమంలో సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తన వంతు సాయంగా రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని బ్లడ్ బ్యాంకులో మెగాస్టార్ బ్లడ్ డొనేషన్ చేశారు. అత్యవసర సేవలు అందించే బ్లడ్ బ్యాంకులపై లాక్‌డౌన్ ప్రభావం పడకుండా ఉండేందుకు, వాటిలో రక్త నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
undefined
Also Read:పెళ్లి కోసం 850 కి.మీ. సైకిల్‌పై: ఇంటికి చేరకుండానే క్వారంటైన్‌కి
ఈ నేపథ్యంలో ఈ పరిస్ధితి నుంచి బయటపడేందుకు ప్రజలు అభిమానులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని చిరంజీవి పిలుపునిచ్చారు. లాక్‌డౌనన్ ఉన్నా రక్తదానం చేయొద్దని ఎవరూ ఆపరని, పోలీసులతో ఏ ఇబ్బందీ రాదని మెగాస్టార్ తెలిపారు.
రక్తదానం చేస్తున్నాం అని తెలపగానే బ్లడ్ బ్యాంక్ నుంచి మీ ఫోన్ వాట్సాప్‌కు పాస్ వస్తుందని, దానిని పోలీసులకు చూపిస్తే సరిపోతుందని చిరు చెప్పారు. రక్తదానం చేసిన చిరంజీవి ఆ సమయంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించారు.
Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏడు కి.మీ నడిచి డెంటల్ ఆసుపత్రిలో ప్రసవం
కాగా మెగాస్టార్‌తో పాటు హీరో శ్రీకాంత్, ఆయన కుమారుడు రోషన్, శ్రీమిత్ర చౌదరి, తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెనర్జీ, సురేశ్ కొండేటి తదితరులు రక్తదానం చేశారు. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.