Today Top Story: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీలో నేడే ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో కీలక భేటీ.. కొత్త క్రిమినల్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం.. బిగ్‌బాగ్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు.. మరోసారి సమగ్ర కుటుంబ సర్వే! .. చంద్రబాబుకు షర్మిల గిప్ట్ ..భారత్ లో విజృంభిస్తోన్న కోవిడ్ కొత్త వేరియంట్ .. రోహిత్ సేన సాధించేనా.. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌వంటి పలు వార్తల సమాహారం.
Today Top Story: నేడే ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో భేటీ
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(డిసెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. పీఎం మోడీ అపాయింట్ ఫిక్స్ దొరకడంతో సీఎం, డిప్యూటీ సీఎం లు రేపు మధ్యాహ్నం ప్రత్యేక ఫ్లైట్ లో హస్తినకు బయలుదేరనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవనున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీగానూ తెలుస్తోంది. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిగా ఎవరు ఉంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా.. ఈ ప్రత్యేక భేటీలో విభజన సమస్యలతో పాటు పెండింగ్యలో ఉన్న ప్రాజెక్టులు, వాటి అనుమతులపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే.. కేసీఆర్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
మరోసారి సమగ్ర కుటుంబ సర్వే!
తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఈ నెల 28వ తారీకు నుంచి వచ్చే నెల ఆరో తారీకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి కుటుంబం వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని ప్రభుత్వం అనుకుంటుంది. తద్వారా ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అర్హులకు చేర్చడానికి ఈ కుటుంబ సర్వే ఉపయోగపడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం నిర్వహించిన సర్వేకు భిన్నంగా ఈ సర్వేలో సమగ్రంగా 32 రకాల సమాచారం సేకరించి, ప్రతి కుటుంబాన్ని సూక్ష్మంగా పరిశీలించడానికి రేవంత్ సర్కారు సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
సన్‌బర్న్ వివాదం..బుక్‌మై షోపై చీటింగ్ కేసు నమోదు
Sunburn: నూతన సంవత్సరం సందర్భంగా సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు పోలీసుల అనుమతి తీసుకోకముందే టిక్కెట్లు విక్రయించారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సన్‌బర్న్‌పై కేసు నమోదైందని, టిక్కెట్లను విక్రయించినందుకు నోడల్ అధికారి, ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో MDకి కూడా నోటీసులు అందజేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో విచారణ జరిపించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీని కోరారు.
చంద్రబాబుకు షర్మిల గిప్ట్ ..
వైఎస్ షర్మిల తీరు చూస్తుంటే నిజంగానే ఆమె అన్న వైఎస్ జగన్ వ్యతిరేకంగా రాజకీయా చేసేందుకు సిద్దమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గరయ్యారు షర్మిల. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆమె యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిస్మస్ పండగవేళ వైఎస్ జగన్ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి గిప్ట్ పంపించారు. ఇలా నారా కుటుంబానికి క్రిస్మస్ గిప్ట్ ఇచ్చి అన్న జగన్ కు రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకు వైఎస్ షర్మిల సిద్దమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
భారత్ లో విజృంభిస్తోన్న కోవిడ్ కొత్త వేరియంట్
భారత్ లో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. జేఎన్.1గా నామకరణం చేసిన ఈ వేరియంట్ మన దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 63 కోవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో గోవాలోనే 34 కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో గత వారం నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్) డాక్టర్ వీకే పాల్ గత వారం అయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. జేఎన్.1ను భారతదేశంలోని శాస్త్రీయ సమాజం నిశితంగా పరిశీలిస్తోందని, రాష్ట్రాలు పరీక్షలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
నూతన క్రిమినల్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం..
పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఇటీవల ఆమోదించిన మూడు సవరించిన క్రిమినల్ చట్టాల బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆమోదం లభించింది. సోమవారం (డిసెంబర్ 25) ద్రౌపది ముర్ము కొత్త క్రిమినల్ లా బిల్లులను ఆమోదం తెలిపారు. ఈ బిల్లులకు గత వారం పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లులు చట్టాలుగా మారాయి. బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC)ని భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)ని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (Nagarik Suraksha Sanhita), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధినీయం (Bharatiya Sakshya Adhiniyam) ద్వారా కొత్త చట్టాలను ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లులను పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో డిసెంబర్ 20న లోక్‌సభ, డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. పార్లమెంట్‌లో మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు..
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ నాడు అన్నపూర్ణ స్టూడియో సమీపంలో జరిగిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫగూడకు చెందిన సుధాకర్, పవన్, సరూర్‌నగర్‌కు చెందిన అవినాష్‌రెడ్డి అనే విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన విధ్వంసం, దాడి ఘటనలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని కండీషన్ పెట్టి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే.. కొన్ని రోజుల పాటు ఎలాంటి మీడియా ప్రకటనలు గానీ, ఇతర ఇంటర్వ్యూలు గాని, ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది.
బిగ్‌బాగ్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు సోమవారంనాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటన నేపథ్యంలో బిగ్ బాగ్ తెలుగు సీజన్ 7 యాజమాన్యం ఎండమోల్ షైన్ కు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులకు సోమవారంనాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఉద్యోగులకు రేవంత్ సర్కార్ న్యూ ఇయర్ గిప్ట్
న్యూ ఇయర్ సందర్భంగా రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సర వేడుకలను మరి సంతోషంగా జరుపుకోవడానికి వీలుగా.. జనవరి 1 ని జనరల్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో రేవంత్ సర్కారు మార్పులు చేసింది. అయితే.. జనవరి 1న సెలవు ఇచ్చినందున ఫిబ్రవరిలోని రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మార్పును ఉద్యోగులందరూ గమనించాలని సూచించింది. కాగా డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు అలసిపోతారని, అందుకే వారి సౌకర్యం కోసం జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
రోహిత్ సేన సాధించేనా.. నేడు దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్
SA vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1 తో సమం చేసి.. అనంతరం ఆడినా వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అధిపత్యం చేలాయించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. నేటీ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్‌ను గెలవలేకపోయింది. ఎలాగైనా ఈ సిరీస్ ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లోని తొలి మ్యాచ్ డిసెంబర్ 26( నేడు)నుంచి ప్రారంభం కానుంది.