తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా ఒకే ఒక్కటి...జిల్లాల్లో ఇదీ పరిస్థితి

Arun Kumar P   | Asianet News
Published : Dec 02, 2020, 10:08 AM ISTUpdated : Dec 02, 2020, 10:18 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా ఒకే ఒక్కటి...జిల్లాల్లో ఇదీ పరిస్థితి

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. 

హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గత 24గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 51,562మందికి టెస్టులు చేయగా కేవలం 565 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 55,51,620 మందికి టెస్టులు చేయగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 925 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,60,155కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 9,266 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో కేవలం ఒకే ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1462కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.03శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 106కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 42, రంగారెడ్డి 43, భద్రాద్రి కొత్తగూడెం 25, కరీంనగర్ 29, ఖమ్మం 21,  సంగారెడ్డి 15, సూర్యాపేట 11, వరంగల్ అర్బన్ 23, నల్గొండ 31, మంచిర్యాల 18, జగిత్యాల11, సిరిసిల్ల 12, నిజామాబాద్ 11, ములుగు 14, సిద్దిపేట 17 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు అంద‌రికీ ఉచిత రైలు ప్ర‌యాణం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం
ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha