దారుణం.. నీళ్లు తాగడానికి వచ్చిన జింక.. కాళ్లు నరికిన కిరాతకులు...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 02, 2020, 09:19 AM IST
దారుణం.. నీళ్లు తాగడానికి వచ్చిన జింక.. కాళ్లు నరికిన కిరాతకులు...

సారాంశం

నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి కాళ్లు నరికిన దుర్మార్గమైన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. పొలాల్లోకి వచ్చిన సాంబర్‌ డీర్‌ వెనక కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.   

రేణ్యాతండా, చిన్నతండా మధ్య ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి ఒక సాంబర్‌ డీర్‌ వచ్చింది. దాన్ని చూసిన కొందరు యువకులు గట్టిగా అరిచారు. భయంతో అరిచారో, దాన్ని పట్టుకోవాలని అరిచారో తెలియదు కానీ గట్టిగా అరవడంతో భయపడిన జంతువు చెరువులోకి దిగి ఈదుకుంటూ కట్ట ఎక్కి పొలాల్లోకి దిగింది. 

అక్కడ బురదగా ఉండడంతో పరుగెత్తలేక నిలిచిపోయింది. అరిచిన యువకులు గొడ్డళ్లతో వెంబడిస్తూ అక్కడికి వచ్చారు. సాంబార్ డీర్ కదలలేని స్థితిలో ఉందన్న ధైర్యంలో జంతువు వెనక వైపు కాళ్లు నరికారు. 

రెండు కాళ్లు విరిగిన సాంబర్‌ జింక గట్టిగా అరవడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. వన్యప్రాణిని ట్రాక్టర్‌లో హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించి శస్త్రచికిత్స చేయించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?