తీరం దాటిన వాయుగుండం... సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 10:35 AM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిందని... దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన  అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఇవాళ తీరం దాటిందని వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున వాయుగుండం ఒడిషాలోన చాంద్ బలికి దక్షిణంగా తీరం దాటిందని...ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తోందని వెల్లడించారు. రానున్న 48 గంటల్లో ఇది ఉత్తర ఒడిషా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ మీదకు పయనిస్తూ క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈ వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపీలోని కోస్తాంధ్ర, ఒడిషాను అనుకునివున్న ఉత్తరాంధ్ర మండలాలలో చెదురుమదురు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో విపత్తుల శాఖ కమిషనర్ కె . కన్నబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

 మరోవైపు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లోని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది. ఇక రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరికొంత పెరిగి తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గోదావరి నదికి నీరు పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  
  
కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు, చెరువులు నిండాయి. వరద ప్రవాహం జనవాసాలను ముంచెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఇటీవల సిరిసిల్ల పట్టణం నీట మునిగింది. వరద నీటిలో కార్లు, మోటార్ బైక్ లు కొట్టుకుపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగిత్యాలలో లో లెవల్ వంతెన పై నుండి వరద నీరు ప్రవహించింది.  వర్ధన్నపేటలోని ఆలేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించింది.హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిపై వరద నీరు చేరి ప్రధాన వీధులన్నీ నీట మునిగిపోయాయి.  

click me!