తెలంగాణ కరోనా అప్ డేట్: రంగారెడ్డిని మించి నిజామాబాద్ లో...ఆ జిల్లాల్లో కరోనా విజృంభణ

Arun Kumar P   | Asianet News
Published : Apr 06, 2021, 09:59 AM ISTUpdated : Apr 06, 2021, 10:04 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రంగారెడ్డిని మించి నిజామాబాద్ లో...ఆ జిల్లాల్లో కరోనా విజృంభణ

సారాంశం

ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 62,350మందికి కరోనా టెస్టులు చేయగా 1498మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 62,350మందికి కరోనా టెస్టులు చేయగా 1498మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,14,735కు చేరితే టెస్టుల సంఖ్య 1,04,98,347కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 245మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,013కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,993యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 5,323గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1729కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.27శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 16, నాగర్ కర్నూల్ 16, జోగులాంబ గద్వాల 9,  కామారెడ్డి 8, ఆదిలాబాద్ 26, భూపాలపల్లి 7, జనగామ 16, జగిత్యాల 60, అసిఫాబాద్ 7, మహబూబ్ నగర్ 22, మహబూబాబాద్ 6, మెదక్ 21, నిర్మల్ 85, నిజామాబాద్ 142,  సిరిసిల్ల 43, వికారాబాద్ 25, వరంగల్ రూరల్ 0,  ములుగు 5, పెద్దపల్లి 22, సిద్దిపేట 19, సూర్యాపేట 42, భువనగిరి 29, మంచిర్యాల 34, నల్గొండ 45 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 313కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 164, రంగారెడ్డి 128, కొత్తగూడెం 9, కరీంనగర్ 46, ఖమ్మం 36,  సంగారెడ్డి 29, వరంగల్ అర్బన్ 62కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 


 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?