తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లోనూ భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Jan 05, 2021, 09:31 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: హైదరాబాద్ లోనూ భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

సారాంశం

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇప్పడు రాజధాని హైదరాబాద్ లోనూ పరిస్థితి అదుపులోకి వస్తోంది.  

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 42,485మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 253మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,87,993కు చేరితే టెస్టుల సంఖ్య 70,61,049కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 317 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,81,400కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,039 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,793గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1554కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.3శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.71శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేటలో కేసులేవి బయటపడలేవు. ఇక జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 3, ఆదిలాబాద్ 4, భూపాలపల్లి 4, జనగామ 2, జగిత్యాల 7, అసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 4, మెదక్ 2, నాగర్ కర్నూల్ 6,  నిర్మల్ 3, నిజామాబాద్ 4,  సిరిసిల్ల 4, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 3,  ములుగు 5, పెద్దపల్లి 7, సిద్దిపేట 2, సూర్యాపేట 4, భువనగిరి 5, మంచిర్యాల 9, నల్గొండ 10, వనపర్తి 4 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా  61కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 18, రంగారెడ్డి 17, కొత్తగూడెం 7, కరీంనగర్ 14, ఖమ్మం 7,  సంగారెడ్డి 3, వరంగల్ అర్బన్  20కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 

 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu