తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం...రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Published : Nov 04, 2020, 09:19 AM ISTUpdated : Nov 04, 2020, 09:29 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆందోళనకరం...రోజురోజుకు పెరుగుతున్న యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తున్నట్లు కనిపిస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 45,526 మందికి కరోనా టెస్టులు చేయగా 1637 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 44,39,856కి చేరగా మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరాయి. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 1273మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,24,686కు చేరింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్  కేసుల సంఖ్య 18,100కు చేరింది. 

read more  మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా...భార్యాకుమారులకు కూడా

 అయితే కరోనా బారినపడ్డ వారిలో గత 24గంటల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1357కి చేరింది. కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 0.55, దేశంలో 1,5శాతాలుగా వుండగా రికవరీ రేటు రాష్ట్రంలో 92.03, దేశంలో 92.1 శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ (హైదరాబాద్) లో అత్యధికంగా 292 కేసులు బయటపడితే ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.  కరీంనగర్ 90, ఖమ్మం 74, మేడ్చల్ 129, నల్గొండ 101, రంగారెడ్డి 136, వరంగల్ అర్బన్ 56 కేసులు బయటపడ్డాయి. మిగతాజిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది. 

పూర్తి వివరాలు:


  

PREV
click me!

Recommended Stories

రూ. 1641 కోట్ల‌తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం.. ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం
Fertility: తెలంగాణ‌లో ప‌డిపోతున్న సంతానోత్ప‌త్తి.. ఫెర్టిలిటీ చికిత్సల్లో పారదర్శకత పెరగాల్సిందే