ఆరు నెలలుగా అత్యాచారం... గర్భందాల్చిన మైనర్ బాలిక

Arun Kumar P   | Asianet News
Published : Nov 04, 2020, 08:46 AM IST
ఆరు నెలలుగా అత్యాచారం... గర్భందాల్చిన మైనర్ బాలిక

సారాంశం

ఓ కామాంధుడు 13ఏళ్ల మైనర్ బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాలిక గర్భం దాల్చింది.  

నల్గొండ: అభం శుభం తెలియని ఓ చిన్నారిని బెదిరించి ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. ఓ కామాంధుడు 13ఏళ్ల మైనర్ బాలికపై గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో గర్భం దాల్చింది.  ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తిరుమలగిరి సాగర్ పంచాయితీ పరిధిలోని ఓ తండాకు చెందిన ఓ కుటుంబం స్థానిక ఎమ్మెల్యే బావమరిది వద్ద పనిచేస్తున్నారు. 13ఏళ్ల కూతురితో కలిసి బార్యాభర్తలు మూడేళ్లుగా యజమాని ఇంటి ఆవరణలో ఓ గదిలో నివాసముంటున్నారు. 

అయితే తల్లిదండ్రులు పనిపై  బయటకు వెళ్లగా బాలిక ఇంట్లో ఒంటరిగా వుండేది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకుని ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. 

తాజాగా బాలిక అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లుగా తెలిపారు. దీంతో అవాక్కయిన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి బయటపెట్టింది. 

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిని వ్యక్తికి పెళ్లి కావడమే కాదు పిల్లలు కూడా వున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్