తెలంగాణ కరోనా అప్ డేట్: గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, ఆ జిల్లాల్లో జీరో కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Nov 30, 2020, 09:21 AM ISTUpdated : Nov 30, 2020, 09:33 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, ఆ జిల్లాల్లో జీరో కేసులు

సారాంశం

తెలంగాణలో తాజాగా కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గాయి. 

హైదరాబాద్: ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా తెలంగాణలో మాత్రం అంతకంతకు తగ్గుతూ వస్తోంది. గత 24గంటల్లో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా (శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) 33,040  మందికి పరీక్షలు చేపట్టగా కేవలం 593మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 54,53,463కు చేరితే మొత్తం కేసులు సంఖ్య 2,69,816కు చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1058 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,58,336కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10,022 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1458కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 95.74శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 119కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 55, రంగారెడ్డి 33, భద్రాద్రి కొత్తగూడెం 12, కరీంనగర్ 40, ఖమ్మం 21,  సంగారెడ్డి 33, సూర్యాపేట 16, వరంగల్ అర్బన్ 39,  వరంగల్ రూరల్ 18, నల్గొండ 21, మంచిర్యాల 15, జగిత్యాల16, సిరిసిల్ల 17, నిజామాబాద్ 18, ములుగు 12 కేసులు నమోదయ్యాయి.  ఇక ఆసిఫాబాద్, యాదాద్రి జిల్లాలో అతి తక్కువగా జీరో కేసులు నమోదయ్యాయి.   

పూర్తి వివరాలు: 

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా