రసవత్తరంగా గ్రేటర్ పోరు: చిల్లిగవ్వ లేకుండా ఒకరు... కోట్ల ఆస్తులతో మరొకరు

By Arun Kumar PFirst Published Nov 22, 2020, 9:24 AM IST
Highlights

గ్రేటర్ బరిలో నిలిచిన వారిలో సామాన్యులూ, సంపన్నులు వున్నారు. చిల్లిగవ్వ లేకుండా ఫోటీలో నిలిచిన వారు ఒకరయితే కోట్ల ఆస్తులతో బరిలోకి దిగిన వారు మరికొందరు. 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓ ప్రధాన ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులందరు  నామినేషన్లు దాఖలు చేసి ప్రచార బరిలో దూకారు. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 

గ్రేటర్ బరిలో నిలిచిన వారిలో సామాన్యులూ, సంపన్నులు వున్నారు. చిల్లిగవ్వ లేకుండా ఫోటీలో నిలిచిన వారు ఒకరయితే కోట్ల ఆస్తులతో బరిలోకి దిగిన వారు మరికొందరు. ఉన్నత చదువులు చదివిన వారు కొందరయితే నిరక్షరాస్యులు మరికొందరు. ఇలా వేరువేరు నేపథ్యాలున్నా ప్రజల మెప్పు పొంది కార్పోరేటర్ గా గెలవాలన్నదే ప్రతిఒక్కరి అంతిమ లక్ష్యం. 

read more  జీహెచ్ఎంసీ ఎన్నికలు: 68 నామినేషన్లు తిరస్కరణ

ఇక కొందరు అభ్యర్థుల తమ నామినేషన్ సందర్భంగా వెల్లడించిన స్థిర, చరాస్థుల వివరాలను పరిశీలిస్తే దివంగత పీజేఆర్‌ తనయ, టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్థి విజయారెడ్డి రూ.23,84,92,000 ఆస్తులతో అందరు అభ్యర్థుల కంటే ముందు వరుసలో నిలిచారు. ఇక రాజేంద్రనగర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజా పేరిట ఎలాంటి ఆస్తులు లేవట. అంతే కాదు కనీసం వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లో చిల్లిగవ్వ కూడా లేదట. కోట్లు ఖర్చు చేయాల్సిన ఎన్నికల్లో బరిలోకి దిగి చిల్లిగవ్వ కూడా లేవని ఆమె ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఇక ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోమన్ కంటే ఆయన భార్య బొంతు శ్రీదేవి పేరిటే ఆస్తులు ఎక్కువగా వున్నాయి. చర్లపల్లి నుండి బరిలోకి దిగిన ఆమెకు రూ.6 కోట్లకు పైగా ఆస్తులుండగా 4 కోట్ల పైచిలుకు అప్పులు వున్నాయంటూ ప్రకటించారు.  
 

click me!