తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు బయటపడ్డాయి,
హైదరాబాద్: తెలంగాణలో తాజాగా అతి తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో(శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 32,714మందికి టెస్టులు చేయగా కేవలం 316మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 64,75,766కు చేరగా కేసుల సంఖ్య 2,81,730కి చేరాయి.
ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 612 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,73,625కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,590యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
undefined
ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1515కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.12శాతంగా వుంది.
జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో కేసులేమీ నమోదుకాలేవు. జోగులాంబ గద్వాల 1, ఆదిలాబాద్ 6, భూపాలపల్లి 1, జనగామ 4, జగిత్యాల 6, వనపర్తి 1, అసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 3, మెదక్ 2, నాగర్ కర్నూల్ 8, నిర్మల్ 2, నిజామాబాద్ 6, సిరిసిల్ల 5, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 5, ములుగు 5, పెద్దపల్లి 4, సిద్దిపేట 6, సూర్యాపేట 3, భువనగిరి 1, మంచిర్యాల 9, నల్గొండ 8 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 86కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 22, రంగారెడ్డి 30, కొత్తగూడెం 12, కరీంనగర్ 18, ఖమ్మం 13, సంగారెడ్డి 14, వరంగల్ అర్బన్ 18కేసులు నమోదయ్యాయి.
పూర్తి వివరాలు:
Telugu Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 21.12.2020) pic.twitter.com/1GIUeqE2ia
— Dr G Srinivasa Rao (@drgsrao)