నాంపల్లిలో కారు బీభత్సం

Published : Dec 21, 2020, 07:59 AM ISTUpdated : Dec 21, 2020, 08:17 AM IST
నాంపల్లిలో కారు బీభత్సం

సారాంశం

హోటల్ ముందు వాహనాల పార్కింగ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యురిటీ గార్డును ఢీకొని అక్కడే పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతోపాటు సుమారు 10 ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి.

హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకువచ్చి.. ఓ హోటల్ ముందు నిల్చొని ఉన్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా సమీపంలోని పార్కింగ్ చేసిన కొన్ని ద్విచక్రవాహనాలపైకి కూడా దూసుకువెళ్లింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన అశ్విన్(22) అనే యువకుడు నాంపల్లి రెడ్ హిల్స్ మీదుగా బేగంపేట వైపు కారులో వేగంగా వెళుతున్నాడు.  కాగా..  రెడ్ హిల్స్ లోని నిలోఫర్ హోటల్ వద్దకు చేరుకునే సరికి కారు అదుపుతప్పింది.

దీంతో హోటల్ ముందు వాహనాల పార్కింగ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యురిటీ గార్డును ఢీకొని అక్కడే పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతోపాటు సుమారు 10 ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుకి గాయాలు కావడంతో అతనిడి పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు